దుత్తలూరు
Date09-5-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. పది తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని CH. కరీనాకు రూ.20,000 నగదు పురస్కారం అందజేశారు. అలాగే ఇంటర్మీడియట్‌లోCEC లో 473 మార్కులు సాధించిన విద్యార్థిని అనితకు రూ.10,000 నగదు బహుమతి ప్రదానం చేశారు.
ఈ నగదు పురస్కారాలను అక్షయ ఫౌండేషన్‌కు చెందిన పవన్ కుమార్ రెడ్డి, క్రిష్ణారెడ్డి గారు,బ్రహ్మారెడ్డి రెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జె. సైమన్ గారు, స్కూల్ ఛైర్మన్ రమేష్ గారు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల విజయాలు దుత్తలూరు మండలానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు



