మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన త్విషా శర్మ వరకట్న వేధింపులు మరియు అనుమానాస్పద మరణం కేసులో సీబీఐ కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్‌ను అరెస్ట్ చేసింది.
హైకోర్టు ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన అనంతరం సీబీఐ అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేశారు. కేసులో త్విషా శర్మకు మరణానికి ముందు గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైన విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కేసులో ఇప్పటికే త్విషా భర్త సమర్థ్ సింగ్ సీబీఐ కస్టడీలో ఉన్నాడు. మరణానికి దారితీసిన పరిస్థితులపై సీబీఐ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తోంది.


