రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి)
బీజేపీ ముస్తాబాద్ మండల శాఖ డిమాండ్
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాం, రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహించాలని కోరారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువతకు తెలంగాణ విమోచన చరిత్రను తెలియజేసేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపికృష్ణ, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్, ఆవునూర్ నాయకులు, ఉపాధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


