Saturday, 15 August 2026
  • Home  
  • తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీలో ‘దందా’ ఆరోపణలు..కొత్త కళాకారులకు శాపంగా మారిన మోసాలు
- ఖమ్మం

తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీలో ‘దందా’ ఆరోపణలు..కొత్త కళాకారులకు శాపంగా మారిన మోసాలు

తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీలో ‘దందా’ ఆరోపణలు..కొత్త కళాకారులకు శాపంగా మారిన మోసాలు *డబ్బులు తీసుకుని వర్క్‌ చేయరు* *ఫోన్‌ ఎత్తరు* *ప్రశ్నిస్తే బెదిరింపులు ఆరోపణలు* *సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్లు, డిజైనర్ల తీరుపై బాధితుల ఆవేదన..* *అవకాశాల కోసం వచ్చే యువతకు తీరని నష్టం* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 14 ఖమ్మం: తెలంగాణ అంటేనే జానపద కళలకు, ఫోక్‌ పాటలకు ప్రత్యేక గుర్తింపు. గ్రామీణ జీవనశైలిని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద గీతాలు నేడు యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎంతోమంది కళాకారులకు ఫోక్‌ పాటలు ఉపాధి మార్గంగా మారాయి. అయితే ఇదే రంగంలో కొందరి వ్యవహారశైలి కొత్తగా అవకాశాల కోసం వచ్చే కళాకారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. *అడ్వాన్స్‌ పేరుతో వేలు.. లక్షల్లో వసూళ్లు* కొత్తగా ఫోక్‌ సాంగ్స్‌ చేయాలనుకునే యువత, కళాకారుల నుంచి కొందరు సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్లు, పోస్టర్‌ డిజైనర్లు పాటలు, మ్యూజిక్‌, పోస్టర్లు, ప్రమోషన్‌ వర్క్‌ల పేరుతో ముందస్తుగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకున్న తర్వాత కొందరు పని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పని చేయాలని లేదా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడం, సమాధానాలు దాటవేయడం, మరికొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. *భూక్యా కళ్యాణ్‌ పై బాధితుల ఆరోపణలు* భూక్యా కళ్యాణ్‌ అనే వ్యక్తి కొందరి వద్ద లక్షల్లో డబ్బులు తీసుకున్నారని, తిరిగి డబ్బులు అడిగినప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి వివరణ ఇవ్వాల్సి ఉంది. *ఆరోపణలు వాస్తవమా కాదా* అనే విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోస్టర్‌ డిజైనర్‌ సాగర్‌ పై ఫిర్యాదులు అదేవిధంగా పోస్టర్‌ డిజైనర్‌ సాగర్‌ ముదిరాజ్‌ (సొప్పరి సాగర్‌) కూడా పోస్టర్లు తయారు చేసి ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారని, అనంతరం ఫోన్‌ కాల్స్‌కు స్పందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపైనా సంబంధిత వ్యక్తి వివరణ ఇవ్వాల్సి ఉంది. ‘ఫోక్‌ మాఫియా’ అంటూ చర్చ ఫోక్‌ ఇండస్ట్రీలో తప్పు చేసిన వారిని ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడంతో కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు వ్యక్తులు ఒక వర్గంగా ఏర్పడి కొత్త కళాకారులకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని, తమ పరిచయాలు, ప్రభావంతో ఇతరులను వెనక్కి నెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. *అసలైన జానపద కళాకారులకు అన్యాయం* తెలంగాణ జానపద కళకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ, ఆ కళను నమ్ముకుని జీవిస్తున్న అసలైన కళాకారులకు తగిన అవకాశాలు, పారితోషికం, గుర్తింపు లభించకపోతే వారు క్రమంగా ఈ రంగానికి దూరమయ్యే ప్రమాదం ఉందని కళా భిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శక వ్యవస్థ అవసరం ఫోక్‌ సాంగ్‌ రంగంలో పాటలు, మ్యూజిక్‌, షూటింగ్‌, పోస్టర్‌ డిజైనింగ్‌, ప్రమోషన్‌ తదితర పనులకు ముందస్తుగా డబ్బులు తీసుకునే విధానంలో రాతపూర్వక ఒప్పందాలు, చెల్లింపుల రసీదులు, పని పూర్తిచేసే గడువులు తప్పనిసరి చేయాలని పలువురు కోరుతున్నారు. మోసపోయిన కళాకారులు ఆధారాలతో పోలీసులను ఆశ్రయించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కూడా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని వారు కోరుతున్నారు. *ఫోక్‌ ఇండస్ట్రీకి పేరు తెచ్చేది కొందరి వ్యక్తిగత దందాలు కాదు* తెలంగాణ జానపద కళాకారుల ప్రతిభ. ఆ ప్రతిభను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కొత్త కళాకారులను ప్రోత్సహించాల్సిన రంగం.. వారి ఆశలను, ఆర్థిక పరిస్థితులను దోపిడీ చేసే వేదికగా మారకూడదనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీలో ‘దందా’ ఆరోపణలు..కొత్త కళాకారులకు శాపంగా మారిన మోసాలు

*డబ్బులు తీసుకుని వర్క్‌ చేయరు*
*ఫోన్‌ ఎత్తరు* *ప్రశ్నిస్తే బెదిరింపులు ఆరోపణలు*
*సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్లు, డిజైనర్ల తీరుపై బాధితుల ఆవేదన..*

*అవకాశాల కోసం వచ్చే యువతకు తీరని నష్టం*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 14

ఖమ్మం:

తెలంగాణ అంటేనే జానపద కళలకు, ఫోక్‌ పాటలకు ప్రత్యేక గుర్తింపు.

గ్రామీణ జీవనశైలిని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద గీతాలు నేడు యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఎంతోమంది కళాకారులకు ఫోక్‌ పాటలు ఉపాధి మార్గంగా మారాయి.

అయితే ఇదే రంగంలో కొందరి వ్యవహారశైలి కొత్తగా అవకాశాల కోసం వచ్చే కళాకారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

*అడ్వాన్స్‌ పేరుతో వేలు.. లక్షల్లో వసూళ్లు*

కొత్తగా ఫోక్‌ సాంగ్స్‌ చేయాలనుకునే యువత, కళాకారుల నుంచి కొందరు సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్లు, పోస్టర్‌ డిజైనర్లు పాటలు, మ్యూజిక్‌, పోస్టర్లు, ప్రమోషన్‌ వర్క్‌ల పేరుతో ముందస్తుగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

డబ్బులు తీసుకున్న తర్వాత కొందరు పని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

పని చేయాలని లేదా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడం, సమాధానాలు దాటవేయడం, మరికొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

*భూక్యా కళ్యాణ్‌ పై బాధితుల ఆరోపణలు*

భూక్యా కళ్యాణ్‌ అనే వ్యక్తి కొందరి వద్ద లక్షల్లో డబ్బులు తీసుకున్నారని, తిరిగి డబ్బులు అడిగినప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి వివరణ ఇవ్వాల్సి ఉంది.

*ఆరోపణలు వాస్తవమా కాదా*

అనే విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

పోస్టర్‌ డిజైనర్‌ సాగర్‌ పై ఫిర్యాదులు
అదేవిధంగా పోస్టర్‌ డిజైనర్‌ సాగర్‌ ముదిరాజ్‌ (సొప్పరి సాగర్‌) కూడా పోస్టర్లు తయారు చేసి ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారని, అనంతరం ఫోన్‌ కాల్స్‌కు స్పందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపైనా సంబంధిత వ్యక్తి వివరణ ఇవ్వాల్సి ఉంది.
‘ఫోక్‌ మాఫియా’ అంటూ చర్చ
ఫోక్‌ ఇండస్ట్రీలో తప్పు చేసిన వారిని ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడంతో కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు వ్యక్తులు ఒక వర్గంగా ఏర్పడి కొత్త కళాకారులకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని, తమ పరిచయాలు, ప్రభావంతో ఇతరులను వెనక్కి నెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

*అసలైన జానపద కళాకారులకు అన్యాయం*

తెలంగాణ జానపద కళకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ, ఆ కళను నమ్ముకుని జీవిస్తున్న అసలైన కళాకారులకు తగిన అవకాశాలు, పారితోషికం, గుర్తింపు లభించకపోతే వారు క్రమంగా ఈ రంగానికి దూరమయ్యే ప్రమాదం ఉందని కళా భిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పారదర్శక వ్యవస్థ అవసరం
ఫోక్‌ సాంగ్‌ రంగంలో పాటలు, మ్యూజిక్‌, షూటింగ్‌, పోస్టర్‌ డిజైనింగ్‌, ప్రమోషన్‌ తదితర పనులకు ముందస్తుగా డబ్బులు తీసుకునే విధానంలో రాతపూర్వక ఒప్పందాలు, చెల్లింపుల రసీదులు, పని పూర్తిచేసే గడువులు తప్పనిసరి చేయాలని పలువురు కోరుతున్నారు.

మోసపోయిన కళాకారులు ఆధారాలతో పోలీసులను ఆశ్రయించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కూడా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని వారు కోరుతున్నారు.

*ఫోక్‌ ఇండస్ట్రీకి పేరు తెచ్చేది కొందరి వ్యక్తిగత దందాలు కాదు*

తెలంగాణ జానపద కళాకారుల ప్రతిభ. ఆ ప్రతిభను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కొత్త కళాకారులను ప్రోత్సహించాల్సిన రంగం.. వారి ఆశలను, ఆర్థిక పరిస్థితులను దోపిడీ చేసే వేదికగా మారకూడదనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.