హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న 5.09 ఎకరాల భూమి వివాదం తెలంగాణ ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూమిని ఇటీవల ప్రభుత్వం వేలం వేయగా ₹1,038 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయితే భూమిపై తమకే హక్కు ఉందని ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రభుత్వం ఎస్బీఐలో ఉన్న తన ఖాతాలు, డిపాజిట్లను ఇతర బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసలు భూమిని కార్పొరేట్ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించినప్పటికీ బ్యాంకు అభివృద్ధి పనులు చేపట్టలేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ – ఎస్బీఐ భూవివాదం మరింత ముదురుతోంది