పున్నమి ప్రతినిధి , తాళ్లపూడి జూలై 17: తాళ్లపూడి మండల ఎంపీడీవో కార్యాలయంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకులు, ఇంటి స్థలాల కేటాయింపు తదితర సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రతి సమస్యను అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాబోయే పుష్కరాలకు ముందే గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్ల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు. విద్యుత్, రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.8 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో లక్ష్మీ లావణ్య, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




