అనకాపల్లి జిల్లా, ఆగస్టు 5 (పున్నమి రిపోర్టర్ ఆనంద్):
యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామ అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఆహారమని, పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం ద్వారా శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాటలు పడతాయని వివరించారు. తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, మూడు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు తల్లిపాల ప్రాధాన్యత, తల్లి–శిశు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ సూపర్వైజర్ లీల, ఏఎన్‌ఎమ్ రేవతి, ఆశా వర్కర్ కె. లక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు ఎస్.కే. పాతిమునిషా, ఆర్. కనకలక్ష్మి, రంజిన్ బేబీ (AWH), ఎం. లోవలక్ష్మి (AWH) పాల్గొని తల్లులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ.. రేగుపాలెం అంగన్వాడిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 5 (పున్నమి రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామ అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఆహారమని, పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం ద్వారా శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాటలు పడతాయని వివరించారు. తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, మూడు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు తల్లిపాల ప్రాధాన్యత, తల్లి–శిశు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ సూపర్వైజర్ లీల, ఏఎన్‌ఎమ్ రేవతి, ఆశా వర్కర్ కె. లక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు ఎస్.కే. పాతిమునిషా, ఆర్. కనకలక్ష్మి, రంజిన్ బేబీ (AWH), ఎం. లోవలక్ష్మి (AWH) పాల్గొని తల్లులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

