తణుకు, ఆగస్టు 23, 2026 : స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీషు వారికి ఎదురొడ్డి పోరాడిన ధీరుడు “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు అని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆనందం మస్తాన్ రావు అన్నారు. అప్పటి మద్రాసు నగరంలో బ్రిటీషు వారిపై తిరబడి, సైమన్ కమిషన్ ను ఎదిరించి, “సైమన్ గో బ్యాక్” అని నినదించి, బ్రిటీషు పోలీసుల తుపాకీలకు తన గుండె చూపించి తనను కాల్చమని గర్జించిన సింహం “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు అని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆనందం మస్తాన్ రావు (బాబీ) కొనియాడారు. న్యాయవాద వృత్తిలో తాను సంపాదించిన యావదాస్తిని స్వాతంత్ర్య పోరాటం కోసం ఖర్చు చేసిన నిష్కళంక దేశ భక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఆనందం మస్తాన్ రావు (బాబీ) అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి విశేష సేవలు చేశారని ఆయన వివరించారు.*
*టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై నాల్గవ జయంతి సందర్భంగా తణుకు సొసైటీ రోడ్ లోని మున్సిపల్ పార్కు వద్ద గల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద జరిగిన జయంతి సభలో ఆనందం మస్తాన్ రావు (బాబీ) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.*
*తొలుత “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆనందం మస్తాన్ రావు (బాబీ), సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కోడూరి ఆంజనేయులు పుష్పమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. పలువురు ప్రకాశం పంతులు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జేజేలు అర్పించారు.

