Friday, 24 July 2026
  • Home  
  • ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
- రాజన్న సిరిసిల్ల

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

రాజన్న సిరిసిల్ల ,ముస్తాబాద్ జులై 24( పున్నమి ప్రతినిధి. ) . ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సిరిసిల్ల నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ భూక్య భాస్కర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కుల కోసం గొంతెత్తిన యువత, విద్యార్థులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి బీజేపీ ప్రభుత్వం బలప్రయోగానికి పాల్పడడం బాధాకరమన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని చెప్పే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా అణచివేత చర్యలకు దిగడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తూ యువత గొంతును గౌరవించాలని ఆయన కోరారు.

రాజన్న సిరిసిల్ల ,ముస్తాబాద్ జులై 24( పున్నమి ప్రతినిధి. )

. ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సిరిసిల్ల నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ భూక్య భాస్కర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కుల కోసం గొంతెత్తిన యువత, విద్యార్థులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి బీజేపీ ప్రభుత్వం బలప్రయోగానికి పాల్పడడం బాధాకరమన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని చెప్పే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా అణచివేత చర్యలకు దిగడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తూ యువత గొంతును గౌరవించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.