పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ఆగస్టు 03 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం :
మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలోని ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 6, 7, 8 తేదీలలో సూళ్లూరుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అలాగే ఆగస్టు 10న సూళ్లూరుపేట పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు



