మేడ్చల్ (పున్నమి రిపోర్టర్):
గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలలో తరచూ విచారణ (ఇంక్వైరీ) పేరుతో తెలంగాణ ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు అధికారులు పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలంగాణ డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ JAC ప్రెసిడెంట్ సందీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు ఇళ్లలోనే నివసిస్తున్నారా లేదా అని తేల్చడానికి అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టారని గుర్తుచేశారు. ప్రతిసారీ పేద ప్రజలు తమ రోజువారీ ఉద్యోగాలకు, పనులకు సెలవులు పెట్టి మరీ అధికారులు అడిగిన ఆధారాలు చూపిస్తూ తామే నివాసం ఉంటున్నామని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. తరచూ సెలవులు పెట్టడం వల్ల కొందరు పేదలు తమ ఉపాధిని, ఉద్యోగాలను కూడా కోల్పోయారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు పోతుందేమోనన్న భయంతో ఇప్పటివరకు అధికారులకు పూర్తిగా సహకరించినప్పటికీ, ఈ వేధింపులకు ముగింపు లేకుండా పోయిందన్నారు.
”ప్రజలు విధులకు వెళ్లిన సమయం చూసి విచారణకు రావడం, సమాచారం అందుకున్న లబ్ధిదారులు హుటాహుటిన పనులు వదిలేసి రావడం ఏంటి? అధికారులకు అసలు మానవత్వం ఉందా?” అని సందీప్ ప్రశ్నించారు. అధికారులకు అంతగా అనుమానం ఉంటే ప్రతి ఇంటికీ ‘బయోమెట్రిక్’ విధానాన్ని ఏర్పాటు చేయాలని, పదే పదే విచారణల పేరుతో ఇబ్బందులు పెట్టడం తక్షణమే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విచారణ పేరుతో లబ్ధిదారులను వేధించడం ఆపాలి: తెలంగాణ డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ JAC ప్రెసిడెంట్ సందీప్ డిమాండ్
మేడ్చల్ (పున్నమి రిపోర్టర్): గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలలో తరచూ విచారణ (ఇంక్వైరీ) పేరుతో తెలంగాణ ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు అధికారులు పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలంగాణ డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ JAC ప్రెసిడెంట్ సందీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు ఇళ్లలోనే నివసిస్తున్నారా లేదా అని తేల్చడానికి అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టారని గుర్తుచేశారు. ప్రతిసారీ పేద ప్రజలు తమ రోజువారీ ఉద్యోగాలకు, పనులకు సెలవులు పెట్టి మరీ అధికారులు అడిగిన ఆధారాలు చూపిస్తూ తామే నివాసం ఉంటున్నామని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. తరచూ సెలవులు పెట్టడం వల్ల కొందరు పేదలు తమ ఉపాధిని, ఉద్యోగాలను కూడా కోల్పోయారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు పోతుందేమోనన్న భయంతో ఇప్పటివరకు అధికారులకు పూర్తిగా సహకరించినప్పటికీ, ఈ వేధింపులకు ముగింపు లేకుండా పోయిందన్నారు. ”ప్రజలు విధులకు వెళ్లిన సమయం చూసి విచారణకు రావడం, సమాచారం అందుకున్న లబ్ధిదారులు హుటాహుటిన పనులు వదిలేసి రావడం ఏంటి? అధికారులకు అసలు మానవత్వం ఉందా?” అని సందీప్ ప్రశ్నించారు. అధికారులకు అంతగా అనుమానం ఉంటే ప్రతి ఇంటికీ ‘బయోమెట్రిక్’ విధానాన్ని ఏర్పాటు చేయాలని, పదే పదే విచారణల పేరుతో ఇబ్బందులు పెట్టడం తక్షణమే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు.

