రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చిట్వేల్ మండల ఉద్యాన శాఖ అధికారి బి. లోకేష్‌పై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ళ మణి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రైతులతో కలిసి మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులుకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పందికాళ్ళ మణి మాట్లాడుతూ మండలంలోని రైతులు బొప్పాయి, అరటి, మామిడి, నిమ్మ, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఉద్యాన శాఖ అధికారి రైతులకు అందుబాటులో ఉండకపోవడం, పంటలపై సాంకేతిక సలహాలు సకాలంలో అందించకపోవడం, ఫోన్‌లో రైతులకు స్పందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.మండల స్థాయిలో రైతు సదస్సులు నిర్వహించి పురుగుమందుల వినియోగం, తెగుళ్ల నివారణ, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని కోరారు. వాస్తవాలను విచారించి బాధ్యతారాహిత్యం రుజువైతే చర్యలు తీసుకోవడంతో పాటు, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఉద్యాన శాఖ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు ఓబిలి పెంచలయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి కటారి శంకరయ్య, నాయకులు ఒలిమి నాగయ్య, జ్యోతి నాగేశ్వరయ్య, వేమన తిరుపయ్య, మల్లారపు గురవయ్య, రైతులు సుబ్బరాయుడు, చలపతి రాజు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో లేని ఉద్యాన శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలి