Friday, 28 August 2026
  • Home  
  • ట్రాఫిక్ పై సీఐ స్పెషల్ డ్రైవ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్రాఫిక్ పై సీఐ స్పెషల్ డ్రైవ్

కలిగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. రోడ్డుకు ఆనుకుని వాహనాలు నిలపడం, తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో సీఐ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకుండా, వ్యాపారులు రహదారిని ఆక్రమించకుండా అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని సీఐ సూచించారు.ఈ డ్రైవ్ లో కలిగిరి ఎస్సై లతీ ఫున్నిసా వింజమూరు ఎస్సై ఉమా మహేశ్వర రావు, సిబ్బంది ఉన్నారు. Uploaded Video:

కలిగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. రోడ్డుకు ఆనుకుని వాహనాలు నిలపడం, తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో సీఐ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకుండా, వ్యాపారులు రహదారిని ఆక్రమించకుండా అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని సీఐ సూచించారు.ఈ డ్రైవ్ లో కలిగిరి ఎస్సై లతీ ఫున్నిసా వింజమూరు ఎస్సై ఉమా మహేశ్వర రావు, సిబ్బంది ఉన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.