విజయవాడలో షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డిని కలిసి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, సహాయ కార్యదర్శి ఏ. అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న వినతిపత్రం అందించారు. మారికవలస గురుకుల విద్యాసంస్థను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే జీవో 69ను రద్దు చేయాలని, సెంటర్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. మారికవలస ఇంగ్లీష్ మీడియం పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, నీట్, ఐఐటీ, ఎంసెట్ కోచింగ్‌ను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఏటపాక మండలం కోతులగుట్ట హాస్టల్‌లో మలేరియా మాత్రల ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జీవో 69 రద్దు చేయాలి : ఆదివాసీ గిరిజన సంఘం