Monday, 18 May 2026
  • Home  
  • జిల్లా డెంటల్ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మీనారాయణ
- తిరుపతి

జిల్లా డెంటల్ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మీనారాయణ

శ్రీకాళహస్తి, మే 18, (పున్నమి న్యూస్): తిరుపతి జిల్లా డెంటల్ సర్జన్ అసోసియేషన్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ ఎం. లక్ష్మీనారాయణను శ్రీకాళహస్తి పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆయన సేవాతత్పరత, వైద్య రంగంలో చేసిన కృషి ఆదర్శనీయమని కొనియాడారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన వ్యక్తికి జిల్లా స్థాయి సంఘంలో ఈ గౌరవం దక్కడం ఆనందదాయకమని పేర్కొన్నారు. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయకత్వంలో దంత వైద్యుల సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం. ఉమేష్ రావు, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొని దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.