Wednesday, 9 September 2026
  • Home  
  • చింతూరు ఐటీడీఏకు నూతన పీఓగా నరేంద్ర పడాల్
- అల్లూరి సీతారామరాజు

చింతూరు ఐటీడీఏకు నూతన పీఓగా నరేంద్ర పడాల్

చింతూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నూతన ప్రాజెక్ట్ అధికారిగా చిట్ట పులి నరేంద్ర పడాల్‌ ఐఏఎస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమం,విద్య,వైద్యం, మౌలిక వసతులు,ఉపాధి తదితర రంగాల అభివృద్ధిలో ఐటీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త ప్రాజెక్ట్ అధికారి రాకతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపందిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. *గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి* చింతూరు ఐటీడీఏ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, వంతెనలు, సాగునీరు, ఉపాధి వంటి అంశాలపై ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలను సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటే గిరిజనులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గిరిజన యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.నూతన పీఓ చిత్తపులి నరేంద్ర పడాల్‌ ఐఏఎస్‌ నేతృత్వంలో చింతూరు ఐటీడీఏ మరింత సమర్థవంతంగా పనిచేసి గిరిజన సంక్షేమానికి బాటలు వేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

చింతూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నూతన ప్రాజెక్ట్ అధికారిగా చిట్ట పులి నరేంద్ర పడాల్‌ ఐఏఎస్‌ నియమితులయ్యారు.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమం,విద్య,వైద్యం, మౌలిక వసతులు,ఉపాధి తదితర రంగాల అభివృద్ధిలో ఐటీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త ప్రాజెక్ట్ అధికారి రాకతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపందిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి*

చింతూరు ఐటీడీఏ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, వంతెనలు, సాగునీరు, ఉపాధి వంటి అంశాలపై ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఏజెన్సీలోని మారుమూల గ్రామాలను సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటే గిరిజనులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గిరిజన యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.నూతన పీఓ చిత్తపులి నరేంద్ర పడాల్‌ ఐఏఎస్‌ నేతృత్వంలో చింతూరు ఐటీడీఏ మరింత సమర్థవంతంగా పనిచేసి గిరిజన సంక్షేమానికి బాటలు వేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.