Sunday, 20 September 2026
  • Home  
  • చర్ల పర్యటనలో మంత్రి తుమ్మలకు ఘన స్వాగతం.. వద్దిపేట చెక్‌డ్యాం నిర్మాణానికి వినతి
- భద్రాద్రి కొత్తగూడెం

చర్ల పర్యటనలో మంత్రి తుమ్మలకు ఘన స్వాగతం.. వద్దిపేట చెక్‌డ్యాం నిర్మాణానికి వినతి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానించి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చర్ల మండల ప్రజలు, రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వద్దిపేట చెక్‌డ్యాం నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. చెక్‌డ్యాం నిర్మాణం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని వివరించారు. అదేవిధంగా చర్ల మండలంలోని ప్రజా సమస్యలు, వ్యవసాయ రంగ అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా మంత్రితో చర్చించి, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల సమస్యలను పరిశీలించి, సాధ్యమైన మేర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానించి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చర్ల మండల ప్రజలు, రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వద్దిపేట చెక్‌డ్యాం నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. చెక్‌డ్యాం నిర్మాణం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని వివరించారు.
అదేవిధంగా చర్ల మండలంలోని ప్రజా సమస్యలు, వ్యవసాయ రంగ అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా మంత్రితో చర్చించి, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల సమస్యలను పరిశీలించి, సాధ్యమైన మేర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.