ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 27 (పున్నమి ప్రతినిధి)
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలని ఇన్చార్జి డీపీవో వసుమతి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామ వీధుల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయాలని సూచించారు. అనంతరం మనుబోలులోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జలజాక్షి, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి : ఇన్చార్జి డీపీవో వసుమతి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 27 (పున్నమి ప్రతినిధి) గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలని ఇన్చార్జి డీపీవో వసుమతి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామ వీధుల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయాలని సూచించారు. అనంతరం మనుబోలులోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జలజాక్షి, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

