Wednesday, 22 July 2026
  • Home  
  • గ్రామ సింహాల పై నివారణ చర్యలు చేపట్టండి… గడివేముల గ్రామ ప్రజల డిమాండ్.
- నంద్యాల

గ్రామ సింహాల పై నివారణ చర్యలు చేపట్టండి… గడివేముల గ్రామ ప్రజల డిమాండ్.

గడివేముల గ్రామంలో గ్రామ సింహాలు రహదారులపై గుంపులు గుంపులుగా తిరుగుతూ హల్చల్ చేస్తూన్నాయి. గ్రామంలో ద్విచక్ర వాహనదారులు మరియు పాదచారులు తమ సొంత పనులు సైతం నిర్వహించుకోవడానికి గృహాల నుండి బయలుదేరి రహదారులపై ప్రయాణాలు చేయడానికి గ్రామ సింహాల దెబ్బకు భయపడుతున్నారు. పాఠశాలలకు వెళ్ళు రహదారులలో గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా హల్చల్ చేస్తూ విద్యార్థిని, విద్యార్థులకు హాని కలిగిస్తూ ఆసుపత్రిపాలు చేస్తున్నాయి.ద్విచక్ర వాహనదారులు రహదారులపై ప్రయాణించేటప్పుడు గ్రామ సింహాలు వాహనదారుల వెంటపడుతుండడంతో వాహనదారులు కిందపడి కాళ్లు చేతులు విరగొట్టుకొని ఆసుపత్రుల పాలవుతున్నారు.గ్రామం లోని ప్రధాన రహదారులే కాకుండా,గ్రామంలోని ప్రతి వీధిలో రాత్రి పగలను తేడా లేకుండా గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా రహదారులపై తిరుగుతూ పాదచారులపై దూకుతూ,ద్విచక్ర వాహనదారులను తరుముతూ ప్రమాదాలకు గురిచేస్తుండడంతో ప్రజలు భయాందోళలకు గురవుతున్నారు.గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా వచ్చి గృహాల వద్ద నున్న చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. వృద్ధులు,మహిళలు,పాదాచారులు సైతం ఒంటరిగా రహదారులపై నడవడానికి భయపడుతున్నారు. గ్రామంలోని ప్రజలు గ్రామ సింహాల బెడద తగ్గించండని పలుమార్లు పంచాయతీ అధికారికి ఫిర్యాదులు చేసిన గ్రామపంచాయతీ, సంబంధిత అధికారులు పట్టించుకోకుండా గాలికి వదిలేసారని…గ్రామంలో గ్రామ సింహాల నుండి ప్రాణభయం లేకుండా రహదారులపై నడవలేని పరిస్థితి నెలకొందని,పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, గ్రామ ప్రజలు గ్రామ సింహాల భయంతో ఇళ్లకే పరిమితం అవుతున్నామని, ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్సులు స్పందించి గ్రామ సింహాల బెడద నివారణ,నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని గడివేముల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.