Saturday, 23 May 2026
  • Home  
  • గూడూరు గ్రామంలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు
- రాజన్న సిరిసిల్ల

గూడూరు గ్రామంలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు

ముస్తాబాద్ మే 2 3 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, హైదరాబాద్ వారి పరీక్షా కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు. శిబిరాన్ని గ్రామ సర్పంచ్ చీటి సునీత–వెంకటనర్సింగరావు, ఉప సర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, గ్రామ కార్యదర్శి చిరంజీవి ఉషా, వార్డు సభ్యులు కాసులవాడ శ్రీనివాస్, ఎదునూరి శ్రీలత–శ్రీనివాస్, వంగూరి లావణ్య–కిషన్, పుల్లూరి సంతోష్ తదితరులు పర్యవేక్షించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు అందించిన సహకారంతో శిబిరం విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. శిబిరంలో పాల్గొన్న గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు, సిబ్బందికి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముస్తాబాద్ మే 2 3 పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, హైదరాబాద్ వారి పరీక్షా కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు.
శిబిరాన్ని గ్రామ సర్పంచ్ చీటి సునీత–వెంకటనర్సింగరావు, ఉప సర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, గ్రామ కార్యదర్శి చిరంజీవి ఉషా, వార్డు సభ్యులు కాసులవాడ శ్రీనివాస్, ఎదునూరి శ్రీలత–శ్రీనివాస్, వంగూరి లావణ్య–కిషన్, పుల్లూరి సంతోష్ తదితరులు పర్యవేక్షించి విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు అందించిన సహకారంతో శిబిరం విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. శిబిరంలో పాల్గొన్న గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు, సిబ్బందికి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.