Thursday, 30 July 2026
  • Home  
  • గులాబీ జెండా స్థూపం ధ్వంసంపై కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మండిపాటు
- ఖమ్మం

గులాబీ జెండా స్థూపం ధ్వంసంపై కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మండిపాటు

ఖమ్మం, జూలై (పున్నమి న్యూస్ ) ఖమ్మం నగర 8వ డివిజన్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు నూతనంగా నిర్మించిన గులాబీ గద్దెను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకులు పార్టీ గుర్తులు, నిర్మాణాలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గులాబీ జెండాను కూల్చే శక్తి ఎవరికీ లేదని, ప్రజల గుండెల్లో ఉన్న బీఆర్ఎస్‌ను చెరిపేయడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు పార్టీ శ్రేణులు భయపడవని, ప్రజల పక్షాన తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాజీ డిప్యుటీ మేయర్ బత్తుల మురళి, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్ లు పాల్గొన్నారు

ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ )

ఖమ్మం నగర 8వ డివిజన్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు నూతనంగా నిర్మించిన గులాబీ గద్దెను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకులు పార్టీ గుర్తులు, నిర్మాణాలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గులాబీ జెండాను కూల్చే శక్తి ఎవరికీ లేదని, ప్రజల గుండెల్లో ఉన్న బీఆర్ఎస్‌ను చెరిపేయడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు పార్టీ శ్రేణులు భయపడవని, ప్రజల పక్షాన తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మాజీ డిప్యుటీ మేయర్ బత్తుల మురళి, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్ లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.