ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ )
: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)లో భాగంగా ఓటర్ల నుంచి అందిన దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 85.96 శాతం దరఖాస్తులు డిజిటలైజ్ అయ్యాయి. కలెక్టర్ దివాకర్ సూచనల మేరకు 100 శాతం పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల వారీగా పాలేరు 91.44 శాతంతో తొలి స్థానంలో ఉండగా, సత్తుపల్లి 91.12, వైరా 90.54, మధిర 89.91 శాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో 72.51 శాతం డిజిటలైజేషన్ నమోదైంది.



