Sunday, 13 September 2026
  • Home  
  • కే ఎన్ బి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా – పాత్రికేయులకు మట్టి వినాయక విగ్రహాలు పూజా సామాగ్రి పంపిణీ
- విశాఖపట్నం

కే ఎన్ బి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా – పాత్రికేయులకు మట్టి వినాయక విగ్రహాలు పూజా సామాగ్రి పంపిణీ

విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, (పున్నమి ప్రతినిధి )సెప్టెంబర్ 13: వినాయక చవితిని పురస్కరించుకొని ఆనందపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేఎన్‌బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో మండలంలోని పాత్రికేయులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పండ్లు, పత్రి, స్వీట్లు పంపిణీ చేశారు. ఆదివారం ఆనందపురం జంక్షన్–బీపీ కల్లాలు రోడ్డులోని శుభశ్రీ ఫంక్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డబ్బీరు విజయ్‌కుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేఎన్‌బీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై పాత్రికేయులకు సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కోరాడ నాగభూషణరావుకు పాత్రికేయులంటే ఎంతో గౌరవమని తెలిపారు. ట్రస్ట్ ప్రారంభమైన వెంటనే తొలి కార్యక్రమాన్ని జర్నలిస్టుల కోసం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, పాత్రికేయులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డబ్బీరు విజయ్‌కుమార్ మాట్లాడుతూ వినాయక చవితిని పాత్రికేయ మిత్రులు కుటుంబ సభ్యులతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. కేఎన్‌బీ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు కాగానే జర్నలిస్టులతో సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆనందపురం ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించేందుకు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే జర్నలిస్టుల కల సాకారం కానుందన్నారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దొంతల చిన్న శ్రీను, కోశాధికారి రౌతు నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్న పాత్రికేయులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎరుకొండ అప్పలరాజు, ఇతర ప్రతినిధులు కుప్ప రామలక్ష్మి, కనకల శ్రీనివాస్, నరసింహమూర్తి, తమ్మిన వెంకటరమణ, ముడసల శ్రీను, వెన్ని అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, (పున్నమి ప్రతినిధి )సెప్టెంబర్ 13:

వినాయక చవితిని పురస్కరించుకొని ఆనందపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేఎన్‌బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో మండలంలోని పాత్రికేయులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పండ్లు, పత్రి, స్వీట్లు పంపిణీ చేశారు. ఆదివారం ఆనందపురం జంక్షన్–బీపీ కల్లాలు రోడ్డులోని శుభశ్రీ ఫంక్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డబ్బీరు విజయ్‌కుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేఎన్‌బీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై పాత్రికేయులకు సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కోరాడ నాగభూషణరావుకు పాత్రికేయులంటే ఎంతో గౌరవమని తెలిపారు. ట్రస్ట్ ప్రారంభమైన వెంటనే తొలి కార్యక్రమాన్ని జర్నలిస్టుల కోసం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని, పాత్రికేయులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డబ్బీరు విజయ్‌కుమార్ మాట్లాడుతూ వినాయక చవితిని పాత్రికేయ మిత్రులు కుటుంబ సభ్యులతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. కేఎన్‌బీ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు కాగానే జర్నలిస్టులతో సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆనందపురం ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించేందుకు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే జర్నలిస్టుల కల సాకారం కానుందన్నారు.

ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దొంతల చిన్న శ్రీను, కోశాధికారి రౌతు నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్న పాత్రికేయులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎరుకొండ అప్పలరాజు, ఇతర ప్రతినిధులు కుప్ప రామలక్ష్మి, కనకల శ్రీనివాస్, నరసింహమూర్తి, తమ్మిన వెంకటరమణ, ముడసల శ్రీను, వెన్ని అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.