కృష్ణ మండలం గుడేబల్లూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బీజేపీ, బీజేవైఎం మండల శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప మాట్లాడుతూ గ్రామాల్లో మొక్కలు నాటడం, రక్తదానం, స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు.
పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన బీజేపీ మండల శాఖకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్జున్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి కనకరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాకిటి మల్లేష్, మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు జావిద్, మండల ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, బీజేవైఎం మండల అధ్యక్షులు వొట్టేవోళ్ల సురేష్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి గౌడ్, కోశాధికారి కోమటి ప్రకాష్ అయ్య, సీనియర్ నాయకులు పూజారి లక్ష్మణ్, శంకరయ్య శెట్టి, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండి బషీర్, గురుపు మల్లేష్, గౌరీశంకర్, వార్డు మెంబర్ జల్ల తిప్పయ్య, పల్లె రమేష్, బూత్ అధ్యక్షులు వాకిటి కాశినాథ్, కున్సి కర్రెప్ప, చందాపూర్ ఆంజనేయులు, ముడుమల్ గ్రామ బీజేవైఎం అధ్యక్షులు ఆంజనేయులు, రాము, అరవింద్, ఆనంద్ ముదిరాజ్, కోర్బెన్ రఘు, పల్లె ఆంజనేయులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

గుడేబల్లూర్‌లో మొక్కలు నాటిన బీజేపీ, బీజేవైఎం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి: బలరాం రెడ్డి, నల్లె నర్సప్ప
కృష్ణ మండలం గుడేబల్లూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బీజేపీ, బీజేవైఎం మండల శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప మాట్లాడుతూ గ్రామాల్లో మొక్కలు నాటడం, రక్తదానం, స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన బీజేపీ మండల శాఖకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్జున్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి కనకరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాకిటి మల్లేష్, మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు జావిద్, మండల ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, బీజేవైఎం మండల అధ్యక్షులు వొట్టేవోళ్ల సురేష్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి గౌడ్, కోశాధికారి కోమటి ప్రకాష్ అయ్య, సీనియర్ నాయకులు పూజారి లక్ష్మణ్, శంకరయ్య శెట్టి, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండి బషీర్, గురుపు మల్లేష్, గౌరీశంకర్, వార్డు మెంబర్ జల్ల తిప్పయ్య, పల్లె రమేష్, బూత్ అధ్యక్షులు వాకిటి కాశినాథ్, కున్సి కర్రెప్ప, చందాపూర్ ఆంజనేయులు, ముడుమల్ గ్రామ బీజేవైఎం అధ్యక్షులు ఆంజనేయులు, రాము, అరవింద్, ఆనంద్ ముదిరాజ్, కోర్బెన్ రఘు, పల్లె ఆంజనేయులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

