ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు1(పున్నమి ప్రతినిధి)
వెంకటగిరిలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే పెద్ద పండగలా పోలేరమ్మ తల్లి జాతర వైభవంగా జరుగుతోందన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు బీజేపీ నాయకత్వానికి ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగాలని ఆకాంక్షించారు. జాతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ చైర్మన్ మురళీని అభినందించారు.

పోలేరమ్మ తల్లి సేవలో సోమిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు1(పున్నమి ప్రతినిధి) వెంకటగిరిలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే పెద్ద పండగలా పోలేరమ్మ తల్లి జాతర వైభవంగా జరుగుతోందన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు బీజేపీ నాయకత్వానికి ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగాలని ఆకాంక్షించారు. జాతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ చైర్మన్ మురళీని అభినందించారు.

