Wednesday, 23 September 2026
  • Home  
  • గిరిజన కాలనీలో జనసేన ‘పేట బ్రదర్స్’ ఆధ్వర్యంలో విద్యా అవగాహన సదస్సు
- తిరుపతి

గిరిజన కాలనీలో జనసేన ‘పేట బ్రదర్స్’ ఆధ్వర్యంలో విద్యా అవగాహన సదస్సు

ఏర్పేడు, ఆగస్టు 18, (పున్నమి టెంపుల్ న్యూస్): ఏర్పేడు మండలంలోని రాజులపాలెం గిరిజన కాలనీలో చదువుకు దూరమైన విద్యార్థులలో మార్పు తీసుకువచ్చేందుకు జనసేన పార్టీ నాయకులు, ‘పేట బ్రదర్స్’ మిత్రబృందం మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని కొంతమంది 5వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు బడి మానేసి ఇళ్లకే పరిమితమయ్యారనే విషయాన్ని స్వచ్ఛంద సంస్థ (NGO) మండల కోఆర్డినేటర్ ప్రగతి శిరీష జనసేన నేతల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమాచారంపై తక్షణమే స్పందించిన జనసేన శ్రేణులు గిరిజన కాలనీలో విస్తృతంగా పర్యటించి, విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. నిత్య జీవితంలో విద్య యొక్క ప్రాధాన్యత, చదువు వల్ల కలిగే ప్రయోజనాలు, మరియు విద్యావంతులైతే కుటుంబాలకు లభించే సామాజిక భద్రత మొదలగు అంశాలపై వారికి క్షుణ్ణంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లేలా చూడాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ సామాజిక చైతన్య కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, కళ్లిపూడి వెంకటేష్, చల్ల హరికృష్ణ, చందు, చల్ల నవీన్, రాజేష్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్స్, జనసేన వీర మహిళ మరియు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.