గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అబ్దుల్ నుమాన్‌ను కొత్తగూడెంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్‌లో 2026 ఏప్రిల్ 26న నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో 1,212 మంది పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ రికార్డు ప్రదర్శనలో అబ్దుల్ నుమాన్ కూడా పాల్గొని తన ప్రతిభను చాటాడు.
ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ శ్రీ మూడు గణేష్ గారి చేతుల మీదుగా అబ్దుల్ నుమాన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణ గారు, పలువురు కార్పొరేటర్లు పాల్గొని అబ్దుల్ నుమాన్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే కరాటేలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వామి కావడం అభినందనీయమని అన్నారు. అబ్దుల్ నుమాన్ సాధించిన విజయం తెలంగాణ రాష్ట్రానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, పాల్వంచ ప్రాంతానికి గర్వకారణమని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అబ్దుల్ నుమాన్ తల్లిదండ్రులు శ్రీ అబ్దుల్ రెహమాన్ గారు, శ్రీమతి ఆయేషా ఫిర్దోస్ గారు తమ కుమారుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వామి కావడం, ఈ సందర్భంగా ఘనంగా సన్మానించడం పట్ల సంతోషం, గర్వం వ్యక్తం చేశారు.
అబ్దుల్ నుమాన్‌కు కరాటేలో శిక్షణ అందిస్తున్న నవోదయ కరాటే ఇన్‌స్టిట్యూట్, పాల్వంచ మాస్టర్ శ్రీ రాంబాబు గారికి తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అబ్దుల్ నుమాన్ విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మాస్టర్ రాంబాబు గారి శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వామిగా నిలిచిన అబ్దుల్ నుమాన్‌కు మేయర్ శ్రీ మూడు గణేష్ గారు, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణ గారు, కార్పొరేటర్లు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన అబ్దుల్ నుమాన్‌కు ఘన సన్మానం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అబ్దుల్ నుమాన్‌ను కొత్తగూడెంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో 2026 ఏప్రిల్ 26న నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో 1,212 మంది పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ రికార్డు ప్రదర్శనలో అబ్దుల్ నుమాన్ కూడా పాల్గొని తన ప్రతిభను చాటాడు. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ శ్రీ మూడు గణేష్ గారి చేతుల మీదుగా అబ్దుల్ నుమాన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణ గారు, పలువురు కార్పొరేటర్లు పాల్గొని అబ్దుల్ నుమాన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే కరాటేలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వామి కావడం అభినందనీయమని అన్నారు. అబ్దుల్ నుమాన్ సాధించిన విజయం తెలంగాణ రాష్ట్రానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, పాల్వంచ ప్రాంతానికి గర్వకారణమని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అబ్దుల్ నుమాన్ తల్లిదండ్రులు శ్రీ అబ్దుల్ రెహమాన్ గారు, శ్రీమతి ఆయేషా ఫిర్దోస్ గారు తమ కుమారుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వామి కావడం, ఈ సందర్భంగా ఘనంగా సన్మానించడం పట్ల సంతోషం, గర్వం వ్యక్తం చేశారు. అబ్దుల్ నుమాన్‌కు కరాటేలో శిక్షణ అందిస్తున్న నవోదయ కరాటే ఇన్‌స్టిట్యూట్, పాల్వంచ మాస్టర్ శ్రీ రాంబాబు గారికి తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అబ్దుల్ నుమాన్ విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మాస్టర్ రాంబాబు గారి శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వామిగా నిలిచిన అబ్దుల్ నుమాన్‌కు మేయర్ శ్రీ మూడు గణేష్ గారు, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణ గారు, కార్పొరేటర్లు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

