*గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో నిరంతరం చెత్త సేకరణ*
*”పరిశుభ్రమైన గ్రామమే మా లక్ష్యం” – సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్*
జులై 09 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
గార్ల ఒడ్డు
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గార్ల ఒడ్డు గ్రామపంచాయతీలో చెత్త సేకరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.
ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి వీధుల్లో తిరుగుతూ చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని చూస్తున్నారు.
*సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ మాట్లాడుతూ*
“గ్రామాన్ని చెత్త రహితంగా, ఆరోగ్యకరంగా ఉంచడమే మా ప్రధాన లక్ష్యం. ప్రతి ఇంటి వద్ద నుండి చెత్త సేకరిస్తున్నాం. ప్రజలు కూడా తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కోరుతున్నాం. పరిశుభ్రమైన
గార్లఒడ్డు గ్రామంగా తీర్చిద్దుతాం” అని తెలిపారు.
గ్రామస్తులు కూడా పంచాయతీ సిబ్బందికి సహకరిస్తూ, వీధుల్లో చెత్త వేయకుండా ఉండాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.


