Sunday, 19 April 2026
  • Home  
  • గాజువాక మహిళా పరిరక్షణ విభాగ చైర్మన్‌గా జాగరపు హరిత నియామకం
- విశాఖపట్నం

గాజువాక మహిళా పరిరక్షణ విభాగ చైర్మన్‌గా జాగరపు హరిత నియామకం

విశాఖపట్నం గాజువాక ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 73వ డివిజన్ సనత్‌నగర్‌కు చెందిన జాగరపు హరిత (బి.టెక్)ను గాజువాక నియోజకవర్గ మహిళా పరిరక్షణ విభాగ చైర్మన్‌గా నియమిస్తూ ఏఐహెచ్‌ఆర్పీ ఫౌండర్ శ్రీ సిరాజుద్దీన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళా సంఘాల ఫోరం జిల్లా, రాష్ట్ర సభ్యులు హరితను అభినందించారు. మహిళల భద్రత, గౌరవం కాపాడటంలో ఈ నియామకం కీలకమని అభిప్రాయపడ్డారు. హరిత మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలను అరికట్టడం అత్యవసరమని తెలిపారు. మహిళలకు న్యాయం జరిగేలా, వారి హక్కులు రక్షించబడేలా కృషి చేస్తానన్నారు. యువతిలో అవగాహన పెంచడం, మహిళల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తన లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, అవసరమైన చోట చట్టపరమైన సహాయం అందించేందుకు ముందుండి పనిచేస్తానని తెలిపారు. ఈ నియామకంపై స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ హరితకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సేవలతో సమాజంలో మహిళల భద్రత మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం గాజువాక ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)

గాజువాక నియోజకవర్గం 73వ డివిజన్ సనత్‌నగర్‌కు చెందిన జాగరపు హరిత (బి.టెక్)ను గాజువాక నియోజకవర్గ మహిళా పరిరక్షణ విభాగ చైర్మన్‌గా నియమిస్తూ ఏఐహెచ్‌ఆర్పీ ఫౌండర్ శ్రీ సిరాజుద్దీన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళా సంఘాల ఫోరం జిల్లా, రాష్ట్ర సభ్యులు హరితను అభినందించారు. మహిళల భద్రత, గౌరవం కాపాడటంలో ఈ నియామకం కీలకమని అభిప్రాయపడ్డారు. హరిత మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలను అరికట్టడం అత్యవసరమని తెలిపారు. మహిళలకు న్యాయం జరిగేలా, వారి హక్కులు రక్షించబడేలా కృషి చేస్తానన్నారు. యువతిలో అవగాహన పెంచడం, మహిళల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తన లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, అవసరమైన చోట చట్టపరమైన సహాయం అందించేందుకు ముందుండి పనిచేస్తానని తెలిపారు. ఈ నియామకంపై స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ హరితకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సేవలతో సమాజంలో మహిళల భద్రత మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.