Sunday, 27 September 2026
  • Home  
  • ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఆదివారం తెరుచుకోనున్న ఎస్బీఐ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఆదివారం తెరుచుకోనున్న ఎస్బీఐ

ఆత్మకూరు: వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్న నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆత్మకూరు ఎస్బీఐ ప్రధాన శాఖలో ఆదివారం ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ మున్వర్ తెలిపారు. నాలుగో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమవారం నుంచి మూడు రోజులపాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ నేపథ్యంలో ఖాతాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం సిబ్బంది విధులకు హాజరై సేవలు అందిస్తారని చెప్పారు. నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ అవసరాలు ఉన్న ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ సూచించారు. ఆదివారం అందుబాటులో ఉండే సేవలను వినియోగించుకుని ముందస్తుగా బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.