Saturday, 29 August 2026
  • Home  
  • క్రషర్ దుమ్ము, బూడిద నుండి నిమ్మ రైతులను ఆదుకోవాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రషర్ దుమ్ము, బూడిద నుండి నిమ్మ రైతులను ఆదుకోవాలి

అనంతసాగరం ఆగష్టు 28,పున్నమి ప్రతినిధి: కేతిగుంట క్రషర్ నుండి వచ్చే దుమ్ము, బూడిద వలన నిమ్మ చెట్లు నాశనం అవుతున్నాయని ఆమని చిరివెళ్ల రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం మండల తహసీల్దార్ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ అనంతసాగరం మండలం ఆమని చిరివెళ్ల గ్రామం నందు 300ఎకరలో నిమ్మ చెట్లను రైతులు సాగుచేస్తున్నారు. కేతిగుంట కొండవద్ద జరిగే రాళ్లు పగలగొట్టి కంకర చేసే క్రషర్ నుండి వచ్చే దుమ్ము, బూడిద మొత్తం నిమ్మ చెట్ల ఆకులపై పడటం వలన ఆకులు, నిమ్మ పూలు, నిమ్మ పిందేలు రాలిపోవడం జరుగుతుందని దీనితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.అలాగే క్రషర్ నుండి వచ్చే దుమ్ము, బూడిద వలన పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలకు ఊపిరితిత్తులకు సంబందించిన మరియు చర్మ వ్యాధుల సమస్యలు వస్తున్నాయిఅన్నారు. క్రషర్ యాజమాన్యం కు బూడిద రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు.కావున మండల తహసీల్దార్ గారు స్పందించి ఈ సమస్య పై చర్యలు తీసుకోని నిమ్మ రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ గా కోరుతున్నామని అన్నారు.ఈ సమస్య పై అధికారులు చర్యలు తీసుకోకపోతే నిమ్మ రైతులను, ఆమని చిరివెళ్ల గ్రామ ప్రజలను సమీకరించి ఆందోళన, పోరాటాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జక్రయ్య, ఆమని చిరివెళ్ల సిపిఎం కార్యదర్శి షబ్బీర్, రైతులు హాజరత్తయ్య, యస్దాని,అమిర్, సుభాని, ఖలీల్,మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

అనంతసాగరం ఆగష్టు 28,పున్నమి ప్రతినిధి:
కేతిగుంట క్రషర్ నుండి వచ్చే దుమ్ము, బూడిద వలన నిమ్మ చెట్లు నాశనం అవుతున్నాయని ఆమని చిరివెళ్ల రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం మండల తహసీల్దార్ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ అనంతసాగరం మండలం ఆమని చిరివెళ్ల గ్రామం నందు 300ఎకరలో నిమ్మ చెట్లను రైతులు సాగుచేస్తున్నారు. కేతిగుంట కొండవద్ద జరిగే రాళ్లు పగలగొట్టి కంకర చేసే క్రషర్ నుండి వచ్చే దుమ్ము, బూడిద మొత్తం నిమ్మ చెట్ల ఆకులపై పడటం వలన ఆకులు, నిమ్మ పూలు, నిమ్మ పిందేలు రాలిపోవడం జరుగుతుందని దీనితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.అలాగే క్రషర్ నుండి వచ్చే దుమ్ము, బూడిద వలన పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలకు ఊపిరితిత్తులకు సంబందించిన మరియు చర్మ వ్యాధుల సమస్యలు వస్తున్నాయిఅన్నారు. క్రషర్ యాజమాన్యం కు బూడిద రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు.కావున మండల తహసీల్దార్ గారు స్పందించి ఈ సమస్య పై చర్యలు తీసుకోని నిమ్మ రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ గా కోరుతున్నామని అన్నారు.ఈ సమస్య పై అధికారులు చర్యలు తీసుకోకపోతే నిమ్మ రైతులను, ఆమని చిరివెళ్ల గ్రామ ప్రజలను సమీకరించి ఆందోళన, పోరాటాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జక్రయ్య, ఆమని చిరివెళ్ల సిపిఎం కార్యదర్శి షబ్బీర్, రైతులు హాజరత్తయ్య, యస్దాని,అమిర్, సుభాని, ఖలీల్,మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.