కోతల బాబుకి వాతలు తప్పవు: కాకాణి ఫైర్
నెల్లూరులో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు కావలి సభలో మత్స్యకారులను మోసం చేసేలా అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిలో నిజంగా సేవ చేసిన నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. జగన్ హయాంలో మత్స్యకార భరోసా రూ.10 వేలకు పెంచి ఐదేళ్లలో రూ.538 కోట్లు అందించామని తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను జగన్ పూర్తి చేస్తే చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. మత్స్యకారుల సంక్షేమంపై టీడీపీ ప్రభుత్వం కోతలు విధిస్తోందని, ఎన్నికల్లో మత్స్యకారులే తగిన బుద్ధి చెబుతారని కాకాణి హెచ్చరించారు.

కోతల బాబుకి వాతలు తప్పవు: కాకాణి ఫైర్
కోతల బాబుకి వాతలు తప్పవు: కాకాణి ఫైర్ నెల్లూరులో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు కావలి సభలో మత్స్యకారులను మోసం చేసేలా అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిలో నిజంగా సేవ చేసిన నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. జగన్ హయాంలో మత్స్యకార భరోసా రూ.10 వేలకు పెంచి ఐదేళ్లలో రూ.538 కోట్లు అందించామని తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను జగన్ పూర్తి చేస్తే చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. మత్స్యకారుల సంక్షేమంపై టీడీపీ ప్రభుత్వం కోతలు విధిస్తోందని, ఎన్నికల్లో మత్స్యకారులే తగిన బుద్ధి చెబుతారని కాకాణి హెచ్చరించారు.

