Tuesday, 8 September 2026
  • Home  
  • కొత్త పెన్షన్ దారులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్ లైన్ గడువు పెంచాలి..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్త పెన్షన్ దారులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్ లైన్ గడువు పెంచాలి..

అనంతసాగరం సెప్టెంబర్ 08,పున్నమి ప్రతినిధి: అనంతసాగరం మండలం లో ఉండే దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలని రెండవ రోజు వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రం బస్టాండ్ తాజ్ కేఫ్ సెంటర్ వద్ద నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు కొత్త పెన్షన్ దారులు ఆన్ లైన్ చేసుకోవాలని ప్రకటించినది. సమయం చాలా తక్కువ వలన కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ మరియు ఇతర సర్టిఫికెట్ లు అవసరం ఉండటం వలన అవి ఇవ్వడానికి రెవిన్యూ అధికారులు రెండు రోజు పడుతుంన్నదిఅన్నారు. సమయం చాలా తక్కువ గా ఉండటం వలన రెవిన్యూ అధికారులు కొత్త పెన్షన్ దారులకు ఇబ్బందులు కలిగించకుండా త్వరగా కులం, ఆదాయం సర్టిఫికెట్ లు ఇవ్వాలని అన్నారు. డప్పు కళాకారుల పెన్షన్ సంబందించి స్పష్టత లేకపోవడం వారికి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారుల వద్ద నుండి ఆన్ లైన్ సర్టిఫికెట్ కావాలని ఆన్ లైన్ లో చూపిస్తుందని కాని సదరు అధికారులకు అడిగితె మాకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు వారికి ఆన్ లైన్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలని అన్నారు.మరియు కొత్త పెన్షన్ ఆన్ లైన్ చేసే సమయంలో సర్వర్ సమస్య రావడం వలన ఆన్ లైన్ చేయడం లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోజుకు పది మందికి కూడా ఆన్ లైన్ కావడం లేదని అన్నారు. ఇలాంటి సమస్యల వలన కొత్త పెన్షన్ లకు అర్హత ఉన్న చాలామంది ఆన్ లైన్ చేసుకోలేక పోవడం జరుగుతుందని అన్నారు. కావున ప్రభుత్వం ఆన్ లైన్ గడువు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల సమస్యల ను పరిష్కారం చేయకుండా ఉంటే చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ నిరసన దీక్షకు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు డాక్టర్ సుబ్బారాయుడు పార్టీ తరుపున సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వేము పెంచలయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి ఉప్పలపాడు మస్తాన్,కేవీపీస్ మండల నాయకులు జక్రయ్య,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగులూరు వెంకటేష్, వంశీ,నల్లు శైలు, కొండయ్య, పెంచలయ్య, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతసాగరం సెప్టెంబర్ 08,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం మండలం లో ఉండే దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలని రెండవ రోజు వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రం బస్టాండ్ తాజ్ కేఫ్ సెంటర్ వద్ద నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు కొత్త పెన్షన్ దారులు ఆన్ లైన్ చేసుకోవాలని ప్రకటించినది. సమయం చాలా తక్కువ వలన కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ మరియు ఇతర సర్టిఫికెట్ లు అవసరం ఉండటం వలన అవి ఇవ్వడానికి రెవిన్యూ అధికారులు రెండు రోజు పడుతుంన్నదిఅన్నారు. సమయం చాలా తక్కువ గా ఉండటం వలన రెవిన్యూ అధికారులు కొత్త పెన్షన్ దారులకు ఇబ్బందులు కలిగించకుండా త్వరగా కులం, ఆదాయం సర్టిఫికెట్ లు ఇవ్వాలని అన్నారు. డప్పు కళాకారుల పెన్షన్ సంబందించి స్పష్టత లేకపోవడం వారికి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారుల వద్ద నుండి ఆన్ లైన్ సర్టిఫికెట్ కావాలని ఆన్ లైన్ లో చూపిస్తుందని కాని సదరు అధికారులకు అడిగితె మాకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు వారికి ఆన్ లైన్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలని అన్నారు.మరియు కొత్త పెన్షన్ ఆన్ లైన్ చేసే సమయంలో సర్వర్ సమస్య రావడం వలన ఆన్ లైన్ చేయడం లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోజుకు పది మందికి కూడా ఆన్ లైన్ కావడం లేదని అన్నారు. ఇలాంటి సమస్యల వలన కొత్త పెన్షన్ లకు అర్హత ఉన్న చాలామంది ఆన్ లైన్ చేసుకోలేక పోవడం జరుగుతుందని అన్నారు. కావున ప్రభుత్వం ఆన్ లైన్ గడువు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల సమస్యల ను పరిష్కారం చేయకుండా ఉంటే చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ నిరసన దీక్షకు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు డాక్టర్ సుబ్బారాయుడు పార్టీ తరుపున సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వేము పెంచలయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి ఉప్పలపాడు మస్తాన్,కేవీపీస్ మండల నాయకులు జక్రయ్య,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగులూరు వెంకటేష్, వంశీ,నల్లు శైలు, కొండయ్య, పెంచలయ్య, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.