కొండాపురం బీసీ బాలుర హాస్టల్ సమస్యలపై బీజేపీ ఫిర్యాదు.కొండాపురం బీసీ బాలుర హాస్టల్లో కనీస వసతుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే కొండాపురం–కలిగిరి రహదారి సమస్యపై జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కొండాపురం మండల బీజేపీ అధ్యక్షులు జడపల్లి మహేష్ సంబంధిత సమస్యలను గ్రీవెన్స్‌లో నమోదు చేసి MPDO ఆదినారాయణ గారికి ఫిర్యాదు చేశారు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, కొండాపురం–కలిగిరి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చైతన్య, బీజేపీ ఉపాధ్యక్షులు కూకట్ల కృష్ణరావు, కార్యదర్శి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.



