శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని కైలసగిరి కాలనీలో ఉన్న మునిసిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో సరస్వతి పూజతో పాటు వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రధానోపాధ్యాయులు వి. హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆశిక, నీలావతి, దిలీప్, లీలావతి, మోహన్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తరగతి ప్రథములు, హాజరు ప్రథములకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.

కైలసగిరి మునిసిపల్ పాఠశాలలో సరస్వతి పూజ, వార్షికోత్సవం ఘనంగా