హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల 15 వేల మంది రైతులకు ఈ పథకం భరోసా కల్పించిందని పేర్కొన్నారు.
అయితే ఆగస్టు 13 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న బీమా పథకం వల్ల సుమారు 13 లక్షల మంది రైతులు బీమా సౌకర్యానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.19 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించిందని హరీశ్ రావు తెలిపారు.
ప్రభుత్వాలు మారినప్పటికీ గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని హరీశ్ రావు స్పష్టం చేశారు.

కేసీఆర్ పథకాలను ఒక్కొక్కటిగా తొలగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: హరీశ్ రావు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల 15 వేల మంది రైతులకు ఈ పథకం భరోసా కల్పించిందని పేర్కొన్నారు. అయితే ఆగస్టు 13 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న బీమా పథకం వల్ల సుమారు 13 లక్షల మంది రైతులు బీమా సౌకర్యానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.19 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించిందని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పటికీ గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని హరీశ్ రావు స్పష్టం చేశారు.

