గొల్లపల్లి కష్టర్బా గాంధీ బాలికల పాఠశాల లో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి సూచనల
రెండు గంటల పాటు విద్యార్థినులతో ముఖాముఖిగా వైద్యుల సంభాషణ
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి లయన్స్ క్లబ్ నిరంతర తోడ్పాటు ప్రెసిడెంట్ బొమ్మెన కుమార్
విద్యార్థి దశలో చదువు ఎంత ముఖ్యమో, శారీరక మరియు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, ఈ రెండూ సమపాళ్లలో ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కేజీబీవీ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపల్లి ఆధ్వర్యంలో విద్యార్థినుల ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తుపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు విద్యార్థినులతో ఎంతో ఆత్మీయంగా ముఖాముఖి ఇంటరాక్ట్ మాట్లాడారు. చదువులో రాణించడానికి ఒత్తిడిని ఎలా జయించాలి, జ్ఞాపకశక్తిని ఎలా పెంపొందించుకోవాలి, కౌమార దశలో ఎదురయ్యే శారీరక మార్పులు-ఆరోగ్య సమస్యలపై విద్యార్థినులకు ఎంతో సరళంగా, అద్భుతంగా వివరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పోషకాహారం తీసుకుంటూ లక్ష్యాల వైపు ఎలా అడుగులు వేయాలో దిశానిర్దేశం చేస్తూ విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు.
సేవే మార్గం.విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొమ్మెన కుమార్ మాట్లాడుతూ.వీ సర్వ్ సేవే పరమావధి అనే ఏకైక నినాదంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తోందని గుర్తుచేశారు. సమాజానికి సేవ చేయడంలో, ముఖ్యంగా మన రేపటి పౌరులైన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపల్లి ఎల్లప్పుడూ ముందుంటుందని గర్వంగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు తమ క్లబ్ తరఫున నిరంతరం తోడ్పాటునందిస్తామని భరోసా ఇచ్చారు. ఇంతటి మంచి కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పద్మ కి, ఇన్చార్జి ప్రిన్సిపల్ భానుప్రియ, శైలజ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, లయన్స్ క్లబ్ కార్యదర్శి మహంకాళి చంద్రశేఖర్, కోశాధికారి సట్ట సురేష్, పాస్ట్ ప్రెసిడెంట్ ముసుకు కరుణాకర్ రెడ్డి, పాస్ట్ కార్యదర్శి సాయిని నరహరి, ఇతర క్లబ్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

