ముంచంగిపుట్టు: మండలం కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు గ్రామగ్రామాన ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 104 సేవల ద్వారా ప్రజలకు 24 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు, సీహెచ్ఓ, జనసేన మండల నాయకుడు మురళి, పెసా కమిటీ చైర్మన్ సింహాచలం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కిలగాడ పీహెచ్సీలో సేవా సంకల్ప్ అభియాన్