కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాలకు డెస్క్ బెంచీల పంపిణీ
కామారెడ్డి/ ఏప్రిల్ 17 /పున్నమి ప్రతినిధి
కే.పి రాజా రెడ్డి జన సేవా సంస్థ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వేంకట రమణా రెడ్డి సొంత నిధులతో కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచీల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ గంజ్ హైస్కూల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 74 డెస్క్ బెంచీలను కౌన్సిలర్ ప్రీతి విపుల్ జైన్ సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా ప్రీతి జైన్ విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి స్థాయికి చేరాలని సూచించగా, ప్రధానోపాధ్యాయురాలు గీత గారు పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కొత్తగా నిర్మించిన పాఠశాల భవనం నూ త్వరగా అందేలా చూడాలని వారిని కోరారు. సంస్థ ప్రతినిధి విపుల్ జైన్ విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్న తమను సంప్రదించవచ్చని ప్రధానోపాధ్యాయురాలు గారికి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు సునీత మేడం మరియు రాజేంద్ర గారు మరియు శైలజ కృష్ణవేణి గార్లు రాజేందర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు



