Friday, 17 April 2026
  • Home  
  • ముస్తాబాద్‌లో భవన నిర్మాణ కార్మికుల సమావేశం – ప్రభుత్వ విధానాలపై ఆందోళన, మేడే ఏర్పాట్లపై చర్చ
- రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో భవన నిర్మాణ కార్మికుల సమావేశం – ప్రభుత్వ విధానాలపై ఆందోళన, మేడే ఏర్పాట్లపై చర్చ

ముస్తాబాద్ ఏప్రిల్ 17 పున్నమి ప్రతినిధి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాబోయే రోజులలో మేడే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశంపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి మాట్లాడుతూ, వెల్ఫేర్ బోర్డు నిధులు సక్రమంగా వినియోగం కావడం లేదని, అవి వృథా అవుతున్నాయని విమర్శించారు. “ఆరోగ్య రక్ష” పేరిట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించడం వల్ల కార్మికులపై దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని అన్నారు. రక్త పరీక్షల పేరుతో రూ.3200 వరకు దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు అబ్రహం, దేవయ్య, అబ్రహం, ఉప్పలయ్య, కొల్లూరు, పుల్లూరి రాములు, గంగయ్య, అన్నమేని లక్ష్మయ్య, మల్లయ్య, సునూరు రఘుపతి, సాయిలు, దబిడ అంజయ్య, పిల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

ముస్తాబాద్ ఏప్రిల్ 17 పున్నమి ప్రతినిధి

ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాబోయే రోజులలో మేడే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశంపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో సీడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి మాట్లాడుతూ, వెల్ఫేర్ బోర్డు నిధులు సక్రమంగా వినియోగం కావడం లేదని, అవి వృథా అవుతున్నాయని విమర్శించారు. “ఆరోగ్య రక్ష” పేరిట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించడం వల్ల కార్మికులపై దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని అన్నారు. రక్త పరీక్షల పేరుతో రూ.3200 వరకు దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.
ఈ సమావేశంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు అబ్రహం, దేవయ్య, అబ్రహం, ఉప్పలయ్య, కొల్లూరు, పుల్లూరి రాములు, గంగయ్య, అన్నమేని లక్ష్మయ్య, మల్లయ్య, సునూరు రఘుపతి, సాయిలు, దబిడ అంజయ్య, పిల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.