అనకాపల్లి జిల్లా, జూలై 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన ముద్రగడ పద్మనాభం మృతిపట్ల ఎలమంచిలి మండలం తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు సన్నంశెట్టి రామునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం జీవితాంతం అహర్నిశలు పోరాడిన మహానేత అని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన, కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు, నిరాహార దీక్షలు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు.
ముద్రగడ పద్మనాభం మరణం కాపు సమాజానికే కాకుండా రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటని సన్నంశెట్టి రామునాయుడు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముద్రగడ చేసిన సేవలు, సమాజం కోసం సాగించిన ఉద్యమాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని నివాళులర్పించారు.
“సేన్నంశెట్టి రామునాయుడు … ఎలమంచిలి మండలం తూర్పు కాపు అధ్యక్షులు”



