ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 26 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో మొహర్రం (పీర్ల పండుగ) వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మొహర్రం మాసం సందర్భంగా గ్రామంలో పీర్లను (పంజా) ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు రాత్రి పీర్ల చావిడి వద్ద మూడవ అగ్నిగుండం ఏర్పాటు చేయగా, భక్తులు నిప్పులపై నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఉత్సవాలు గ్రామంలో ఐక్యత, భక్తి భావాలను చాటుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కాగితాలపూర్లో భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 26 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో మొహర్రం (పీర్ల పండుగ) వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మొహర్రం మాసం సందర్భంగా గ్రామంలో పీర్లను (పంజా) ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు రాత్రి పీర్ల చావిడి వద్ద మూడవ అగ్నిగుండం ఏర్పాటు చేయగా, భక్తులు నిప్పులపై నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఉత్సవాలు గ్రామంలో ఐక్యత, భక్తి భావాలను చాటుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

