కలిగిరిలో వైభవంగా అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ
కలిగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్‌లో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి మృత్తిక, శిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా జీవించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. ఆలయాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

కలిగిరిలో వైభవంగా అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ
కలిగిరిలో వైభవంగా అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కలిగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్‌లో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి మృత్తిక, శిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా జీవించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. ఆలయాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

