ఉదయగిరి బీసీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. 2026 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించినందుకు ప్రధానోపాధ్యాయురాలు షేక్ నూర్జహాన్‌కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలి అవార్డు లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయురాలు బిజిఎస్ విద్యావతిని సేవలకు గుర్తింపుగా ఉదయగిరి మండల ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. ఆమెను కూడా పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఒకే పాఠశాలకు రెండు అవార్డులు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

ఒకే పాఠశాలకు రెండు ఉత్తమ అవార్డులు