Friday, 24 July 2026
  • Home  
  • ఏన్కూరులో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు*
- ఖమ్మం

ఏన్కూరులో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు*

*ఏన్కూరులో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు* వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ బాలాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు* జులై 25 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: మండలంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ బాలాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేటీఆర్ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక రంగ ప్రోత్సాహం, ఐటీ రంగ విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కేటీఆర్ సేవలు విశిష్టమైనవని కొనియాడారు. ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమై ప్రజలకు మరింత చేరువవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు యండ్రాతి మోహన్‌రావు, నామ వెంకయ్య, ఎస్.కే. ఖాసీం, భూక్య బాలాజీ, కొమ్మూరి వెంకటేశ్వర్లు, వాంకుడోత్ లక్ష్మణ్, హరికృష్ణ, ఈశ్వర్ నాయక్, మాదినేని సాయి, బబ్లు, ధరావత్ కృష్ణ, భూక్య రామ, నాగరాజు, బాలస్వామి, బాదావత్ నగేష్, కొర్ర కుమార్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

*ఏన్కూరులో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు*
వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ బాలాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు*

జులై 25 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:
మండలంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ బాలాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం కేటీఆర్
దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక రంగ ప్రోత్సాహం, ఐటీ రంగ విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కేటీఆర్ సేవలు విశిష్టమైనవని కొనియాడారు. ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమై ప్రజలకు మరింత చేరువవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు యండ్రాతి మోహన్‌రావు, నామ వెంకయ్య, ఎస్.కే. ఖాసీం, భూక్య బాలాజీ, కొమ్మూరి వెంకటేశ్వర్లు, వాంకుడోత్ లక్ష్మణ్, హరికృష్ణ, ఈశ్వర్ నాయక్, మాదినేని సాయి, బబ్లు, ధరావత్ కృష్ణ, భూక్య రామ, నాగరాజు, బాలస్వామి, బాదావత్ నగేష్, కొర్ర కుమార్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.