కావలి జనసేనలో నాయకత్వ మార్పులపై చర్చ వేడెక్కుతోంది. కొత్త ఇన్చార్జిగా సుకుమార్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుండగా, తాజాగా సీనియర్ మహిళా నేత పేరును కొందరు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే స్థానికంగా సుకుమార్ రెడ్డికే పగ్గాలు అప్పగించాలని ఆయన అనుచరులు, పార్టీ శ్రేణుల్లోని ఒక వర్గం కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళా నేతకు మద్దతుగా కొన్ని వర్గాలు కదులుతున్నాయనే ప్రచారం కొనసాగుతోంది. తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ప్రస్తుతం కావలి జనసేన రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది.

ఎవరు అడ్డొచ్చినా.. కావలి జనసేన పగ్గాలు సుక్కుకే కావాలంటున్న శ్రేణులు!