ఎల్బీనగర్: ఎల్బీనగర్‌లో కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు.
ఖాతాదారులకు ఆధునిక, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే, వైస్ చైర్మన్ సీఏ యశ్వంత్ కుమార్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్తి ధోలే పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా విస్తృతమైన శాఖల నెట్‌వర్క్‌తో బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్‌లో సేవల విస్తరణలో ఎల్బీనగర్ శాఖ కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కింగ్ కోటిలో రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసి నగర కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు.
నూతన శాఖతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి.
ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.





