ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 23 (పున్నమి పడుతద
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో 35 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న ఎస్సీల శ్మశానవాటికకు ఎట్టకేలకు మహర్దశ పట్టింది. శ్మశానవాటిక అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతూ, సమస్యను స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారుల సమక్షంలో శ్మశాన అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎస్సీల శ్మశానవాటిక అభివృద్ధికి శ్రీకారం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 23 (పున్నమి పడుతద నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో 35 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న ఎస్సీల శ్మశానవాటికకు ఎట్టకేలకు మహర్దశ పట్టింది. శ్మశానవాటిక అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతూ, సమస్యను స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారుల సమక్షంలో శ్మశాన అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

