Tuesday, 2 June 2026
  • Home  
  • ఎగువపల్లిలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహణ.. ..భక్తులతో కిటకిటలాడిన గ్రామం – మొక్కులు తీర్చుకున్న వేలాది మంది భక్తులు..
- ప్రకాశం

ఎగువపల్లిలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహణ.. ..భక్తులతో కిటకిటలాడిన గ్రామం – మొక్కులు తీర్చుకున్న వేలాది మంది భక్తులు..

కనిగిరి, జూన్ (పున్నమి ప్రతి నిధి ) మార్కాపురం జిల్లా కనిగిరి మండలంలోని ఎగువపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాళ్ల మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఎగువపల్లి గ్రామ ప్రజలు సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడగా, భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. తిరుణాళ్ల సందర్భంగా గ్రామంలో వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు పువ్వాడ దామోదర్, పున్నమి న్యూస్ ఖమ్మం జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. తిరుణాళ్ల మహోత్సవం విజయవంతంగా ముగియడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

కనిగిరి, జూన్
(పున్నమి ప్రతి నిధి )

మార్కాపురం జిల్లా కనిగిరి మండలంలోని ఎగువపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాళ్ల మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఎగువపల్లి గ్రామ ప్రజలు సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

భక్తుల రాకతో గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడగా, భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. తిరుణాళ్ల సందర్భంగా గ్రామంలో వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ మహోత్సవంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు పువ్వాడ దామోదర్, పున్నమి న్యూస్ ఖమ్మం జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. తిరుణాళ్ల మహోత్సవం విజయవంతంగా ముగియడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.