Monday, 7 September 2026
  • Home  
  • ఇసుక మాఫియాను అరికట్టాలి టిడిపి మాజీ డైరెక్టర్ కొమరా..
- కడప

ఇసుక మాఫియాను అరికట్టాలి టిడిపి మాజీ డైరెక్టర్ కొమరా..

రాజంపేట నియోజకవర్గ పరిధిలోని బహుద (చెయ్యేరు), పెన్నా నదుల్లో భారీగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై గత ఆరు రోజులుగా పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా అధికారులు,పార్టీ బాధ్యులు స్పందించకపోవడం దారుణమని టీడీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్, సీనియర్ నాయకుడు కొమరా వెంకట నరసయ్య తీవ్రంగా విమర్శించారు.సిద్ధవటం మండలం భాకరాపేటలో టిడిపి పార్లమెంటు మాజీ ఉపాధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సీనియర్ నాయకులతో కలిసి మాట్లాడారు. పెన్నా, బహుద నదుల పరిధిలో వందల కోట్ల రూపాయల విలువైన ఇసుక అక్రమ రవాణాపై పత్రికల్లో వరుసగా వార్తలు వస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు, పార్టీ నాయకత్వం విఫలమయ్యారని ఆరోపించారు.గత నెలలో జోనల్ కోఆర్డినేటర్ దామంచర్ల సత్యకు పలువురు నాయకులు ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. రాజంపేట మండల పరిధిలోని తాళ్లపాక, ఇసుకపల్లి తదితర ప్రాంతాల నుంచి వందలాది టిప్పర్ల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరారు.ఇసుక మాఫియాను అరికట్టకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నరసయ్య హెచ్చరించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకముందే అధిష్ఠానం, జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకుడు ఉన్నం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో ఇన్‌చార్జి విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలకు వెళితే మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లో పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీ అధిష్ఠానం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.రాజంపేట మండల టీడీపీ సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై పార్టీకి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదన్నారు. పత్రికల్లో వస్తున్న వరుస కథనాలతో ప్రజల్లో పార్టీపై చులకన భావన ఏర్పడకముందే అధిష్ఠానం స్పందించి ఇసుక మాఫియాను అరికట్టాలని కోరారు.సమావేశంలో పుత్తా రామచంద్రయ్య, డాక్టర్ శివకుమార్, పామూరు సుబ్రహ్మణ్యం, కడితం రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్, యువ నాయకుడు పుత్త శివానంద తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.